
Live a true personality - Pope Francis
ఈ శుక్రవారం, ఫ్రాన్సిస్ పాపు గారు ఆల్ఫా క్యాంప్ నుండి వచ్చిన యువ ఇటాలియన్ల బృందానికి స్వాగతం పలికారు, ఇది సువార్త ప్రచారంపై దృష్టి సారించిన యువ బృందం. ఈ సమావేశం క్లెమెంటైన్ హాల్‌లో జరిగింది.
పీఠాధిపతుల శుభాకాంక్షల తర్వాత, పాపు గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, నిరంతరం అభివృద్ధి చెందుతున్న లౌకిక ప్రపంచంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు.
మానవ హృదయంలో, అనంతం కోసం దాహం ఎన్నటికీ తీరదు. సాంకేతికతతో పెరిగిన మీలో కూడా, మనం ఎక్కడ నుండి వచ్చాము? ప్రతిదానికీ మూలం ఏమిటి? నా ఉనికికి అర్థం ఏమిటి?వంటి ప్రశ్నలు తలెత్తుతాయి అని పాపు గారు గుర్తుచేశారు.
మన దైనందిన అనుదిన జీవితం గురించి ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పాపు గారు అన్నారు.
సమాధానాల ద్వారా మాత్రమే జీవించే వ్యక్తి మూసివేయబడిన జీవితానికి అలవాటుపడిన వ్యక్తి. ప్రశ్నలతో జీవించే వ్యక్తి బహిరంగంగా ఉండటానికి అలవాటుపడిన వ్యక్తి. దేవుడు ప్రశ్నలను ఇష్టపడతాడు. అని పాపు గారు హితవు పలికారు.
యవ్వనంలో పవిత్రతకు బ్లెస్డ్ కార్లో అక్యూటిస్ ఒక గొప్ప ఉదాహరణ అని పాపు గారు చెప్పారు. ఇటాలియన్ యువకుడైన కార్లో అక్యూటిస్ గారు తన అతి తక్కువ జీవితం కాలంలో, ప్రపంచవ్యాప్తంగా దివ్యసత్ప్రసాద అద్భుతాలపై అవగాహన తీసుకురావడానికి ఇంటర్నెట్‌ను ఒక పరికరంగా ఉపయోగించారని గుర్తుచేశారు.
సజీవుడైన క్రీస్తు ప్రభువు ప్రతి రోజు మరియు ఎప్పటికీ మీ జీవితముగా మారును గాక! మరియు మీరు కార్లో అక్యూటిస్‌ను అనుసరించాలని ఆశిస్తున్నాను. దయచేసి, ఫోటోకాపీలు కావద్దు, నిజమైన వ్యక్తిత్వం కలిగి జీవించండి అని పాపు గారు యువకులకు పిలుపునిచ్చారు.
యూరోప్ అంతటా యువకులలో సహవాసాన్ని పెంపొందించడానికి ఇటలీ దేశం లోని ఇసెర్నియా పీఠం వరం రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది.