"నుత్నీకరణ సువార్త స్వస్థత సభలు"
ఏలూరు మేత్రాసనం గుణ్ణంపల్లి విచారణలో "నుత్నీకరణ సువార్త స్వస్థత సభలు" మరియు "యేసు తిరుహృదయ మహోత్సవ" కార్యక్రమాలు ఘనంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటూ ఈ సభలు (మార్చ్ 9 ,10 ,11 తేదీలలో) జరగనున్నాయి. ఈ కార్యక్రమాలలో విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు, దెందులూరు విచారణ కర్తలు గురుశ్రీ అమ్మన్ రాజా గారు, గురుశ్రీ జయప్రకాష్ గారు పాల్గొన్నానునారని విచారణ గురువులు గురుశ్రీ మైఖేల్ గారు తెలిపారు.
మొదటిరోజు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం మొదలైనది. అధికసంఖ్యలో విచారణ ప్రజలు విశ్వాసులు "నూత్నికరణ సువార్త స్వస్థత సభలలో పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గానాలను ఆలపించారు. గురుశ్రీ జీవన్ బాబు గారు దివ్యాసప్రసాద ఆరాధనను భక్తియుతంగా జరిపారు. ప్రజలందరూ ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ,ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.